Andhra Pradesh: ప్రత్యేక హోదాతో పాటు విభజన అంశాలనూ అమలు చేయాలి: గల్లా జయదేవ్
- ఏపీకి ప్రత్యేక హోదా ప్రజల డిమాండ్
- రాష్ట్రాలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలి
- వారానికి ఒకసారి ప్రధాని కొశ్చన్ అవర్ నిర్వహించాలి
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అంశాలనూ అమలు చేయాలని డిమాండ్ చేశామని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. ఢిల్లీలో అఖిలపక్ష నేతల సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఏపీకి ప్రత్యేక హోదా ప్రజల డిమాండ్ అని అన్నారు. సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాలకు మేలు చేసేలా నిర్ణయాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. యూకే పార్లమెంట్ అనుసరిస్తున్న వారానికి ఒకసారి ప్రధాని కొశ్చన్ అవర్ ను మన దేశ పార్లమెంట్ లో కూడా అమలు చేయాలని కోరారు.
అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలను ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేయాలని జయదేవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలు కావడంపై గల్లా స్పందిస్తూ, ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. బాధ్యతాయుత ప్రతిపక్షపాత్ర పోషిస్తామని చెప్పారు.