VH: హాజీపూర్ ఘటనపై కేసీఆర్ బాధపడుతున్నాడని చెప్పిన కేటీఆర్ బాధితుల కోసం ఎందుకు ముందుకు రావడంలేదు?: వీహెచ్

  • బాధితులకు ఇంతవరకు పరిహారం చెల్లించలేదు
  • తక్షణమే బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి
  • హాజీపూర్ నిందితుడ్ని ఎన్ కౌంటర్ చేయాలి
హాజీపూర్ ఉదంతంలో ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందంటూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. హాజీపూర్ ఘటన పట్ల సీఎం కేసీఆర్ ఎంతో బాధపడ్డారని చెబుతున్న కేటీఆర్, బాధితులను ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావడంలేదని వీహెచ్ ప్రశ్నించారు. ఈ దారుణాలు వెలుగులోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా ఇంతవరకు బాధితులకు నష్టపరిహారం చెల్లించలేదని మండిపడ్డారు. హాజీపూర్ బాధిత కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. వీటన్నింటికంటే మొదట హాజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని, మరోసారి ఇలాంటి ఘాతుకాలకు ఎవరూ పాల్పడకుండా చూడాలని వీహెచ్ కోరారు. 
VH
Telangana
Congress
KCR
KTR

More Telugu News