YSRCP: విభజన హామీలు అమలు చేయాలని కోరాం: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

  • ఢిల్లీలో ముగిసిన అఖిలపక్ష సమావేశం
  • ఏపీకి ప్రత్యేక హోదానే ముఖ్యం
  • బీసీ సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరాం
రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మోదీ వరుసగా రెండోసారి ప్రధాని అయిన తర్వాత నిర్వహించిన తొలిసమావేశం ఇది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని సభ్యులను కోరినట్టు సమాచారం. ఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లో నిర్వహించిన ఈ సమావేశానికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి హాజరయ్యారు.

సమావేశం అనంతరం, మీడియాతో ఆయన మాట్లాడుతూ, విభజన హామీలు అమలు చేయాలని కోరామని, బీసీ సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరినట్టు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదానే ముఖ్యమని, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవిపై తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్సష్టం చేశారు.
YSRCP
vijayasaireddy
mithunreddy
modi
pm

More Telugu News