ఆత్మగౌరవం, సామాజిక తెలంగాణ అర్థాలు మారాయి : సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
- తెలంగాణ ప్రజలు నిరాశలో ఉన్నారు
- అవినీతికి కేరాఫ్‌గా కాళేశ్వరం ప్రాజెక్టు
- కొత్త ప్రభుత్వంలో చుక్కనీరిచ్చే ప్రయత్నం జరగలేదు
ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తానంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దాని ద్వారా ఎన్ని ఎకరాలకు నీరిస్తున్నారో స్పష్టం చేయాలని కోరారు. కాళేశ్వరం అవినీతికి కేరాఫ్‌గా మారిందని ఎండగట్టారు. 15 శాతం పనులు కూడా పూర్తి చేయకుండా ప్రారంభిస్తున్నారంటే తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో అర్థమవుతోందని విమర్శించారు. 15 శాతం పనులకే 50 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలిన 85 శాతం పనులకు ఎంత కావాలో చెప్పాలని డిమాండ్ చేశారు.