Vijayawada: హమ్మయ్య...కేశినేని, దేవినేని కలిశారు : పలు కార్యక్రమాల్లో కలిసి పాల్గొన్న నేతలు

షార్ట్స్‌లో చూడండి
హమ్మయ్య...ఎంపీ కేశినేని, మాజీ మంత్రి దేవినేని కలిశారు. కలిసే కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారానికి పుల్‌స్టాప్‌ పెట్టారు. కార్యకర్తల్లో మనో ధైర్యం నింపారు. ఇంతకీ ఏం జరిగిందంటే...నందిగామ నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో  శనివారం ఇద్దరు నేతలు కలిసి పాల్గొనడం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తంగిరాల వర్ధంతి సభలో ఇద్దరు నాయకులు కలిసి పాల్గొని మాట్లాడిన మాటలు కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపాయి. ఇద్దరూ కార్యక్రమంలో కలిసి పాల్గొనడమే కాదు ఓడిపోయామని అధైర్యపడ వద్దని, ఏ పని వున్నా తమ కార్యాయాల్లో నిర్భయంగా సంప్రదించాలంటూ ఇచ్చిన పిలుపు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని రేపింది.

సార్వత్రిక ఎన్నికల తర్వాత దేవినేని ఉమ తీరును పలు సందర్భాల్లో ఎంపీ కేశినేని నాని ఎండగడుతున్న విషయం తెలిసిందే. పైపెచ్చు ఏకంగా అధినేతపైనే కేశినేని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుండడంతో ఆయన పార్టీ మారుతున్నారన్న ప్రచారం కూడా జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఇద్దరి నాయకుల కలయిక కార్యకర్తల్లో కొత్త ఉత్సాహానికి నాంది అయ్యింది.
Go Back to Shorts
Vijayawada
Kesineni Nani
devineni uma

More Telugu News