Sania Mirza: ప్రాక్టీస్ మానేసి భార్యతో షోయబ్ షికార్లు... వార్తను అందించిన విలేకరిపై సానియా తీవ్ర ఆగ్రహం!

  • లండన్ లో సానియా దంపతులను ఆనుసరించిన విలేకరి
  • వారి వీడియోను తీసి వార్త ఇవ్వడంతో విమర్శలు
  • చెత్త కథనమంటూ మండిపడ్డ సానియా మీర్జా
తన భర్తతో కలిసి బయటకు వెళ్లిన సానియా మీర్జా, ఈ వార్తను బయటి ప్రపంచానికి చెప్పిన జర్నలిస్ట్ పై తీవ్రంగా మండిపడింది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, సానియాల జంట, తమ బిడ్డను తీసుకుని లండన్ లో బయటకు వెళ్లింది. వారితో పాటు పాకిస్థాన్ ఓపెనర్ క్రికెటర్ ఇమాముల్ హక్ కూడా ఉన్నాడు. ఇక వీరిని వెంబడించిన ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్, ఇండియాతో కీలకమైన మ్యాచ్ నేపథ్యంలో ప్రాక్టీస్ మానేసిన షోయబ్ షికార్లు చేస్తున్నాడంటూ, వార్తను అందించాడు. ఈ వార్తను చూసిన పాక్ క్రీడాభిమానుల నుంచి తీవ్ర విమర్శలు రాగా, సానియాకు కోపం నషాళానికంటింది. ట్విట్టర్‌ లో తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ, తమ ఏకాంతాన్ని గౌరవించకుండా, ఓ బిడ్డ తమతో ఉన్నాడని కూడా చూడకుండా, తమను వీడియో తీశావని సదరు జర్నలిస్ట్ పై మండిపడింది. అడగకుండా వీడియో తీయడంతో పాటు చెత్త కథనాన్ని జోడించావని ఆగ్రహాన్నివ్యక్తం చేసింది. మ్యాచ్ ఓడిపోతే భోజనం మానేయాలా? అని ప్రశ్నించింది. మూర్ఖుల బృందం తమ వెంట పడిందని సానియా వ్యాఖ్యానించింది.
Sania Mirza
Shoaib Malik
London
Cricket

More Telugu News