Andhra Pradesh: మా నాన్న ఓ లెజెండ్.. ప్రజలకు ఆయన హీరోగా నిలిచారు!: ఎంపీ రామ్మోహన్ నాయుడు

  • ప్రతీ చిన్నారి తండ్రిని హీరోగా చూస్తుంది
  • నేనూ అలాగే అనుకుంటూ పెరిగా
  • ట్విట్టర్ లో స్పందించిన శ్రీకాకుళం ఎంపీ
ప్రతీ బిడ్డ తన తండ్రిని గొప్ప శక్తులు ఉన్న సూపర్ హీరోగా భావిస్తాడని శ్రీకాకుళం లోక్ సభ సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. తన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు కూడా తనకు సూపర్ హీరో కంటే ఎక్కువనీ, ఆయన్ను హీరోగా చూస్తూనే పెరిగానని వ్యాఖ్యానించారు.

ఎర్రన్నాయుడు తనకు ఆదర్శంగా, బలంగా నిలిచారని చెప్పారు. ఆయన ఓ లెజెండ్ అనీ, ప్రజలకు కూడా రియల్ హీరోగా నిలిచారని ప్రశంసించారు. నేడు అంతర్జాతీయ పిత‌ృ దినోత్సవం సందర్భంగా రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
rammohan naidu
Twitter

More Telugu News