బిగ్ బాస్-3 వచ్చేస్తోంది... అఫీషియల్ ప్రోమోను విడుదల చేసిన స్టార్ మా!
- ఎదురుచూస్తున్న బుల్లితెర అభిమానులు
- త్వరలోనే స్టార్ మాలో ప్రసారం
- హోస్ట్ గా వ్యవహరించనున్న నాగ్!
కాగా, మూడో సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న విషయాన్ని మాత్రం స్టార్ మా ప్రకటించలేదు. జులై మూడోవారం లేదా నాలుగోవారంలో ఇది ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ దఫా బిగ్ బాస్ మరింత కొత్తగా సాగుతుందని ప్రోమోను చూస్తే తెలుస్తోంది. హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరెవరన్న విషయమై ఇంకా ప్రకటన వెలువడాల్సివుంది. దానికి సంబంధించిన ఓ అనఫీషియల్ లిస్ట్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కామన్ మ్యాన్ కు ఈ సీజన్ లో ఎంట్రీ లేదని సమాచారం. హోస్ట్ గా నాగ్ పనిచేయనున్నారన్న వార్తలపైనా అధికారిక సమాచారం తెలియాల్సివుంది.