Cricket: కంగారూ బౌలర్లకు చుక్కలు చూపించిన శ్రీలంక ఓపెనింగ్ జోడీ

  • అర్థసెంచరీలు సాధించిన కరుణరత్నే, పెరెరా
  • తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం
  • 20 ఓవర్లలో లంక 135/1
లండన్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ నేటి మ్యాచ్ లో ఆసీస్ నిర్దేశించిన 335 పరుగుల టార్గెట్ కు శ్రీలంక ఎలా బదులిస్తుందోనని సందేహించిన వాళ్లకు కరుణరత్నే, కుశాల్ పెరెరా జోడీ తిరుగులేని జవాబిచ్చింది. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ వంటి హేమాహేమీ బౌలర్లను ఓ ఆటాడుకుంటూ కరుణరత్నే, పెరెరా జోడీ 13 ఓవర్లకే 100 పరుగులు దాటించింది. తొలి వికెట్ రూపంలో వెనుదిరిగిన పెరెరా కేవలం 36 బంతుల్లోనే 52 పరుగులు సాధించడం విశేషం. ప్రస్తుతం కెప్టెన్ కరుణరత్నే(76)కు తోడుగా తిరిమన్నే ఆడుతున్నాడు. 20 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు వికెట్ నష్టానికి 135 పరుగులు. లంకేయులు గెలవాలంటే 30 ఓవర్లలో సరిగ్గా 200 పరుగులు సాధించాలి.
Cricket

More Telugu News