రుయా ఆసుపత్రిలో దారుణం.. స్ట్రెచర్ అందుబాటులో లేక వ్యక్తి మృతి
- జ్వరంతో ఆసుపత్రిలో చేరిన వ్యక్తి
- ఐసీయూకు తరలించాలని సూచించిన వైద్యులు
- అరగంట పాటు వేచి చూసినా దొరకని స్ట్రెచర్
అయినా స్ట్రెచర్ దొరకక పోవడంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఓ వ్యక్తి స్ట్రెచర్‌ను తీసుకొచ్చి ఇచ్చాడు. అత్యవసర విభాగానికి తరలిస్తుండగానే రోగి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో రోగి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. అయితే మౌలిక వసతుల లేమిపై నేటి ఉదయం చిత్తూరు కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా తనిఖీలు చేసి వెళ్లారు. ఆయన వెళ్లిన కొద్దిసేపటికే ఈ విషాదం చోటు చేసుకుంది.