emiliraj: బాలికతో అసభ్య ప్రవర్తన... ఫాదర్ ఎమిలిరాజ్ అరెస్ట్

  • తాడిపత్రిలో అసభ్యకరంగా ప్రవర్తించిన ఎమిలిరాజ్
  • సీరియస్ అయిన హోంమంత్రి
  • హైదరాబాదులో అరెస్ట్ చేసిన పోలీసులు
బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఫాదర్ ఎమిలిరాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాదులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. కేసు వివరాల్లోకి వెళ్తే, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ బాలిక పట్ల ఎమిలిరాజ్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధిత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించగా... ఎమిలిరాజ్ ను అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులను స్థానికులు అడ్డుకున్నారు. దీంతో, ఏం చేయలేక పోలీసులు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి సుచరితను బాధితురాలి తల్లి ఆశ్రయించారు. దారుణం గురించి తెలుసుకున్న సుచరిత సీరియస్ అయ్యారు. ఆమె ఆదేశాల మేరకు ఎమిలిరాజ్ ను అరెస్ట్ చేశారు.
emiliraj
tadipatri
arrest

More Telugu News