VH: ఈ గవర్నర్ మాకొద్దు... కొత్త గవర్నర్ కావాలి!: అమిత్ షాకు లేఖ రాసిన వీహెచ్
- నరసింహన్ పై వీహెచ్ కొంతకాలంగా అసంతృప్తి
- గవర్నర్ పై విమర్శలు
- డాలర్ శేషాద్రితో పోలిక
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు కొంతకాలంగా ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. వీలుచిక్కినప్పుడల్లా వీహెచ్ గవర్నర్ పై విమర్శలు చేస్తున్నారు. నరసింహన్ తరచుగా పుణ్యక్షేత్రాల సందర్శన చేయడాన్ని ప్రస్తావిస్తూ, తిరుమలలో డాలర్ శేషాద్రి పక్కన నరసింహన్ సరిగ్గా ఫిట్ అవుతారని సెటైర్ కూడా వేశారు. ఈ క్రమంలో, ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ ను నియమించాలంటూ కోరారు. ఈ గవర్నర్ తమకొద్దని కరాఖండీగా చెప్పారు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.