prabhas: 'సాహో' కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను: హీరోయిన్ అనుష్క

షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్ కథానాయకుడిగా .. సుజిత్ దర్శకుడిగా భారీ బడ్జెట్ తో 'సాహో' నిర్మితమవుతోంది. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా నుంచి  నిన్ననే టీజర్ ను వదిలారు. యాక్షన్ సీన్స్ పై కట్ చేసిన ఈ టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులలో చాలామంది ఈ టీజర్ పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఆ జాబితాలో అనుష్క చేరిపోయింది. 'సాహో' టీజర్ చూశాను .. అద్భుతంగా వుంది. నాకు చాలా బాగా నచ్చింది. యూవీ క్రియేషన్స్ వారికీ .. ప్రభాస్ కి .. సుజీత్ కి .. మిగతా యూనిట్ సభ్యులకు అభినందనలు. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ ఇన్స్టా గ్రామ్ అకౌంట్ ద్వారా వ్యక్తం చేసింది. అనుష్క .. ప్రభాస్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. 
Go Back to Shorts
prabhas
shraddha kapoor

More Telugu News