Andhra Pradesh: చంద్రబాబు ఒక్కరే కాదు.. దేశంలో చాలామంది ప్రతిపక్ష నేతల్ని విమానాశ్రయాల్లో చెక్ చేస్తున్నారు!: మంత్రి బొత్స

  • అమరావతి, ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తాం
  • ప్రతిపక్ష నేతలను ఎక్కడయినా తనిఖీలు చేస్తారు
  • మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బొత్స
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వస్తున్న వదంతులను నమ్మవద్దని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధానిపై ఎలాంటి అపోహలు వద్దని తెలిపారు. అమరావతితో పాటు వేర్వేరు ప్రాజెక్టుల్లో అవినీతిని వెలికితీస్తామని స్పష్టం చేశారు. అమరావతిలో ఏపీ మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు.

ఏపీ విభజన తర్వాత పసికందు లాంటి నవ్యాంధ్రను చంద్రబాబు నాశనం చేశారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చెప్పింది చేస్తాం.. చేసేదే చెబుతాం.. ఇదే జగన్ ప్రభుత్వ నినాదం’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబును గన్నవరం ఎయిర్ పోర్టులో సాధారణంగానే తనిఖీ చేశారనీ, అది అధికార విధుల్లో భాగమని బొత్స స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. దేశంలో చాలామంది ప్రతిపక్ష నేతలను తనిఖీ చేస్తున్నారని బొత్స గుర్తుచేశారు.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
YSRCP
Botsa Satyanarayana

More Telugu News