CM Jagan: పార్లమెంటులో మన గళం వినిపించండి: ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం

  • ఏపీ భవన్‌లో సభ్యులతో భేటీ
  • సమస్యలపై సామరస్యపూర్వకంగా చర్చించాలని సూచన
  • కొత్తగా ఎన్నికైన వారికి పలు అంశాలను వివరించిన సీఎం
రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో సామరస్య పూర్వక ధోరణిలో మన వాణి వినిపించాలని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్‌ ఈరోజు ఏపీ భవన్‌లో పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్ర సమస్యలపై రాజీ పడకుండా మన గళం వినిపించాలని, అవసరమైన హక్కులను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఎక్కువ మంది సభ్యులు కొత్తవారు కావడంతో వారికి పలు అంశాలు వివరించారు. ఇంకా సమావేశం కొనసాగుతుండగా పలు అంశాలపై సభ్యులతో జగన్ చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి లోక్‌సభా పక్షం నేత మిధున్‌రెడ్డితోపాటు పార్టీ ఎంపీలంతా హాజరయ్యారు.
CM Jagan
YSRCP
parlamentaryparty meet
ap bhavan
New Delhi

More Telugu News