Andhra Pradesh: నందమూరి బాలకృష్ణ ‘బంట్రోతు’ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి!

  • నేతలంతా ప్రజలకు బంట్రోతులేనన్న వైసీపీ నేత
  • ఎమ్మార్వోను ఇసుకలో పొర్లించి కొట్టింది బంట్రోతేనని ఎద్దేవా
  • ‘కె ట్యాక్స్’ ను పెద్ద బంట్రోతు సంతానం వసూలు చేసిందని చురకలు
అధికార పార్టీ నేతలు అయినా, ప్రతిపక్ష పార్టీ నేతలు అయినా ప్రజలకు బంట్రోతులేననీ, ప్రజా సేవకులేనని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని బంట్రోతు అని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి విమర్శించడంపై బాలయ్య ఈ మేరకు స్పందించారు. తాజాగా బాలయ్య వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కౌంటర్ వేశారు.

టీడీపీ ఎమ్మెల్యేలు అంతా ప్రజలకు బంట్రోతులేనని బాలయ్య భలే డైలాగ్ చెప్పారని వ్యాఖ్యానించారు. మహిళా ఎమ్మార్వోను ఇసుకలో పడేసి కొట్టిన ఎమ్మెల్యే కూడా బంట్రోతేనని ఎద్దేవా చేశారు. ఆశా చెల్లెళ్లను బండబూతులు తిట్టిన వ్యక్తి కూడా సేవకుడనేనని దుయ్యబట్టారు. ప్రజలను హింసించి వందలకోట్ల రూపాయలు ‘కె ట్యాక్స్’ వసూలు చేసిన వారు స్పీకర్ గా చేసిన పెద్ద బంట్రోతుసంతానమే కదా! అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Andhra Pradesh
Telugudesam
YSRCP
Vijay Sai Reddy
Balakrishna
bantrotu
Twitter

More Telugu News