Andhra Pradesh: ఏపీలో ఆర్టీఏ దాడులు.. ఫిట్ నెస్ లేని 125 బస్సుల సీజ్!

  • 152 బస్సుల యజమానులపై కేసు నమోదు
  • ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ఆర్టీఏ అధికారులు
  • ప్రైవేటు వాహనాలు, ఆటోలు కూడా తనిఖీ
ఆంధ్రప్రదేశ్ లో ఫిట్ నెస్ లేకుండా చిన్నారులను పాఠశాలలకు తరలిస్తున్న బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు రవాణాశాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేకుండా, ఫిట్ నెస్ లేకుండా ప్రయాణిస్తున్న 125 బస్సులను అధికారులు సీజ్ చేశారు.

అలాగే నిబంధనలు పాటించని మరో 152 బస్సుల యజమానులపై కేసులు నమోదు చేశారు. మరోవైపు విజయవాడలో డీటీసీ మీరాప్రసాద్ ఆధ్వర్యంలో ప్రైవేటు వాహనాలను తనిఖీలు చేశారు. దీంతో పాటు విద్యార్థులను పాఠశాలలకు తరలించే ప్రైవేటు వాహనాలు, ఆటోలను కూడా తనిఖీ చేస్తున్నామని మీరాప్రసాద్ చెప్పారు.
Andhra Pradesh
tra
raids
no fitness
125 buses seize

More Telugu News