paruchuri: రాజశేఖర్ పెద్ద స్టార్ అవుతాడని నేను ముందే చెప్పాను: పరుచూరి గోపాలకృష్ణ

  • రాజశేఖర్ మంచి ఆర్టిస్ట్
  •  సెట్లో అడుగుపెడితే పాత్రపైనే దృష్టి
  •  ప్రతి సీన్ బాగా రావాలని తపించేవారు
'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, హీరో రాజశేఖర్ గురించి ప్రస్తావించారు. "రాజశేఖర్ తో నేను 'ప్రజాస్వామ్యం' సినిమాను చేశాను. ఒకసారి ఆయన డ్రెస్ చేసుకుని కెమెరా ముందుకు వస్తుంటే, ఆ డ్రెస్ అంత బాగోలేదని అన్నారు నిర్మాత. అంతే.. ఉన్నపళంగా ఆయన షాపింగ్ చేయడానికి వెళ్లిపోయారు.

సెట్లో అడుగుపెడితే ఆయన దృష్టి అంతా కూడా తన పాత్రపైనే ఉండేది. ప్రతి సీన్ చాలా బాగా రావాలని ఆయన తపనపడేవారు. దర్శకుడికి సంతృప్తి కలగలేదనే విషయాన్ని వెంటనే గ్రహించి, 'మళ్లీ చేద్దాం సార్' అనేవారు. నటన పట్ల ఆయనకి గల అంకితభావం చూసి, ఆయన గొప్ప స్టార్ అవుతాడని నేను ముందే చెప్పాను. ఆ తరువాత కాలంలో అదే నిజమైంది" అని చెప్పుకొచ్చారు.

paruchuri
rajasekhar

More Telugu News