vijaysai reddy: చంద్రబాబుకు ఏదో జరిగిపోయినట్టు శోకాలు పెడుతున్నారు!: విజయసాయిరెడ్డి
- గన్నవరం విమానాశ్రయంలో అవమానం జరిగినట్టు శోకాలు పెడుతున్నారు
- కోడికత్తి దాడి జరిగిన తర్వాత జగన్ కు భద్రత ఎందుకు కల్పించలేదు
- ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు, కొన్ని మీడియా సంస్థలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు అవమానం జరిగినట్టు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. విశాఖ విమానాశ్రయంలో కోడికత్తి దాడి జరిగినప్పుడు జగన్ కు భద్రతను ఎందుకు కల్పించలేదని, అప్పుడు పచ్చ మీడియా ఎందుకు ప్రశ్నించలేదని ప్రశ్నించారు.
'ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తే అవమానించినట్టట' అంటూ ఎద్దేవా చేశారు. బీసీ నాయకుడు స్పీకర్ అయితే గౌరవించాల్సిన అవసరం లేదనే మీ ఫిలాసఫీ అందరికీ తెలుసు చంద్రబాబుగారూ అని అన్నారు. గతంలో తమరి కులపెద్ద స్పీకర్ అయినప్పుడు మీరు ఆయనను తోడ్కొని వెళ్లారు... అప్పుడు మీరు పిలవకున్నా హుందాగా జగన్ మీతో పాటు నడిచి స్పీకర్ ను అభినందించారని చెప్పారు. జగన్ కు, మీకు మధ్య ఉన్న తేడా అదేనని అన్నారు.