Visakha sarada peeth: విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారిగా స్వరూపానందేంద్ర శిష్యుడు

  • నేటి నుంచి మూడు రోజులపాటు సన్యాసాశ్రమ దీక్ష
  • హాజరుకానున్న పీఠాధిపతులు, మఠాధిపతులు
  • కృష్ణా తీరంలో ఏర్పాట్లు పూర్తి
విశాఖ శారదా పీఠాధిపతి  స్వరూపానందేంద్ర సరస్వతి శిష్యుడు  కిరణ్‌ బాలస్వామికి పీఠం ఉత్తరాధికారి బాధ్యతలు అప్పగించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు నేటి నుంచి మూడు రోజులపాటు  విజయవాడ కృష్ణా తీరంలోని శ్రీగణపతి సచ్చిదానంద ఆశ్రమం, జయదుర్గా తీర్థం వద్ద బాలస్వామి సన్యాసాశ్రమ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నేటి నుంచి మూడు రోజులుపాటు వివిధ కార్యక్రమాలు ఉంటాయని, చివరగా జగద్గురు శ్రీ చరణులు, బాలస్వామివార్ల అనుగ్రహ భాషణం ఉంటుందని, విద్వత్సన్మానం  నిర్వహిస్తారని నిర్వాహకులు తెలిపారు. బాలస్వామి సన్యాసాశ్రమ దీక్ష కార్యక్రమంలో పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొననున్నారు.
Visakha sarada peeth
kiran balaswamy
swaroopanandendra swamy

More Telugu News