CM Ramesh: పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన సీఎం రమేశ్

  • ప్రశాంత్ కిషోర్‌ను సంప్రదించామనడంలో వాస్తవం లేదు
  • పార్టీ మార్పుపై నన్నెవరూ సంప్రదించలేదు
  • టీడీపీ రాజ్యసభ సభ్యులెవరూ పార్టీ మారరు
తమ పార్టీ వ్యూహకర్తగా నియమించేందుకు ప్రశాంత్ కిషోర్‌ను సంప్రదించామంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని సీఎం రమేశ్ పేర్కొన్నారు. తాను పార్టీ మారనున్నట్టు జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో టీడీపీ అధినేత ఆ పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సీఎం రమేశ్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీ మార్పుపై తమను ఎవరూ సంప్రదించలేదని, తాము కూడా ఈ విషయంలో ఎవర్నీ కలవలేదని, టీడీపీ రాజ్యసభ సభ్యులెవరూ పార్టీ మారరని స్పష్టం చేశారు.
CM Ramesh
Chandrababu
Telugudesam
Rajyasabha Members
Prashanth Kishore

More Telugu News