England: ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి 212 పరుగులకు ఆలౌటైన వెస్టిండీస్

  • చెరో మూడు వికెట్లు తీసిన వుడ్, ఆర్చర్
  • పూరన్ 63 పరుగులు
  • ఇంగ్లాండ్ టార్గెట్ 213 పరుగులు
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ 44.4 ఓవర్లలో 212 పరుగులకు చాపచుట్టేసింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆతిథ్య జట్టు బౌలర్లు ఆరంభం నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్ తో విండీస్ హార్డ్ హిట్టర్లను కట్టడి చేశారు. కరీబియన్ జట్టులో నికోలాస్ పూరన్ (63) టాప్ స్కోరర్. స్టార్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ 36 పరుగులు చేయగా, యువ ఆటగాడు షిమ్రోన్ హెట్మెయర్ 39 పరుగులు సాధించాడు.

మెరుపువీరుడు ఆండ్రీ రస్సెల్ 16 బంతుల్లో చకచకా 21 పరుగులు చేసినా వుడ్ బౌలింగ్ లో వెనుదిరగడంతో విండీస్ భారీ స్కోరు ఆశలు గల్లంతయ్యాయి. ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికొస్తే, వుడ్, ఆర్చర్ చెరో 3 వికెట్లు తీశారు. పార్ట్ టైమ్ బౌలర్ జో రూట్ కూడా రెండు వికెట్లు దక్కించుకోవడం విశేషం.
England
West Indies
World Cup

More Telugu News