Jagan: బీహార్ మాదిరిగా ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేసే యోచన: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

  • నాకు ఈ పదవి జగన్ పెట్టిన భిక్ష అన్న నారాయణస్వామి 
  • మద్యపానం కేన్సర్‌లా పీడిస్తోంది
  • మద్యపాన నిషేధానికి కొత్త పాలసీ
మద్యపానం ప్రతి కుటుంబాన్ని కేన్సర్‌లా పీడిస్తోందని, బీహార్ మాదిరిగా మద్యపాన నిషేధం అమలు చేసే యోచనలో ఏపీ సీఎం జగన్ ఉన్నారని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖా మంత్రి నారాయణ స్వామి పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను ఈ పదవిలో ఉండటానికి జగన్ పెట్టిన భిక్షే కారణమన్నారు. మద్యపానం కారణంగా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని, దాని నిషేధానికి కొత్త పాలసీ తీసుకురానున్నట్టు తెలిపారు.
Jagan
Narayana Swamy
Bihar
Cancer
New Polocy

More Telugu News