ysrcp: గతంలో కూడా జగన్ ఇదే చెప్పారు.. అప్పుడేం జరిగిందో అందరికీ తెలుసు: పయ్యావుల

  • టీడీపీ నేతలు తమతో టచ్ లో ఉన్నారన్న వైసీపీ
  • జాబితా బయటపెట్టాలన్న పయ్యావుల
  • మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ విమర్శ
టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. ఎవరెవరు టచ్ లో ఉన్నారో జాబితా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని జగన్ చెప్పారని... అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఇదంతా కేవలం వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ అని అన్నారు. గవర్నర్ ప్రసంగంలో కేవలం సంక్షేమం మాత్రమే కనిపించిందని...అభివృద్ధి ఎక్కడా కనిపించలేదని చెప్పారు. అమరావతి గురించి ప్రస్తావనే లేదని అన్నారు. నవరత్నాల ప్రసంగంలా ఉందని అన్నారు. 
ysrcp
Telugudesam
Payyavula Keshav
jagan

More Telugu News