chennai: చెన్నైలో నీటికి కటకట.. ఉద్యోగులను ఇంటికి పంపించిన ఐటీ కంపెనీ

  • కార్పొరేట్ కంపెనీలకు సైతం నీటి కటకట
  • ఇబ్బంది కారణంగా అసాధారణ నిర్ణయాలను తీసుకుంటున్న కంపెనీలు
  • ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ విన్నపం
నీటి కొరతతో చెన్నై నగరం కటకటలాడుతోంది. ఆశించిన స్థాయిలో ఇప్పటికీ వర్షాలు పడకపోవడంతో... జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు సైతం నీటి ఎద్దడిని తట్టుకోలేక... అసాధారణ నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తోంది. ఆఫీసులో నీళ్లు లేవు. ఇంటికెళ్లి అక్కడి నుంచి పనిచేసుకోవాలంటూ ఓ ఐటీ కంపెనీ తన ఉద్యోగులను కోరింది. ఇదే రీతిలో ఇంటి నుంచి పని చేయాలంటూ పలు కంపెనీలు తమ ఉద్యోగులను కోరుతున్నాయి. అయితే, ఈ ఏడాది వర్షాలు బాగానే కురుస్తాయనే అంచనాలు నగరవాసులకు కొంత ఊరటను కల్పిస్తోంది.
chennai
water scarcity

More Telugu News