Tamilnadu: కేన్సర్ తో నెలలుగా పోరాటం.. తుదిశ్వాస విడిచిన డీఎంకే ఎమ్మెల్యే రాధామణి!

  • 2016లో విక్రమ్ వండీ నుంచి విజయం
  • కొన్ని నెలల క్రితం కేన్సర్ సోకినట్లు నిర్ధారణ
  • పుదుచ్చేరి జిప్ మర్ లో చికిత్స పొందుతూ మృతి
తమిళనాడులో విపక్ష ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) నేత, ఎమ్మెల్యే రాధామణి(67) కన్నుమూశారు. గత కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న ఆయన పుదుచ్చేరిలోని జిప్ మర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం ఒక్కసారిగా రాధామణి ఆరోగ్యం క్షీణించింది.

దీంతో వైద్యులు ఆయన్ను హుటాహుటిన ఐసీయూకు తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాధామణి డీఎంకే తరఫున విక్రమ్ వండీ అసెంబ్లీ సీటు నుంచి గెలుపొందారు. ఆయన మరణంపై డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, పార్టీ ముఖ్యనేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాధామణి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Tamilnadu
dmk
radhamani
dead
cancer

More Telugu News