Narendra Modi: ఈ పరిస్థితిలో పాక్ తీవ్రవాద వ్యతిరేక చర్యలు తీసుకుంటుందని ఆశించలేం: మోదీ

  • పాక్ సుదృఢ చర్యలు తీసుకోవాలి
  • శాంతి కోసం భారత్ ఎన్నో ప్రయత్నాలు చేసింది
  • ఉగ్రవాదంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పులేదు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ బిష్కెక్ లో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య ఉగ్రవాదంపై చర్చలు జరిగాయి. తీవ్రవాద రహిత వాతావరణం ఏర్పాటుకు పాకిస్థాన్ పటిష్ట చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయితే, ఈ దశలో పాకిస్థాన్ నుంచి అలాంటి చర్యలు ఏమాత్రం ఆశించలేమని మోదీ చైనా అధినేతతో చెప్పారు. భారత్ మాత్రం శాంతి కోసం ఎన్నో ప్రయత్నాలు చేసిందని అన్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ వైఖరిలో ఎలాంటి మార్పులేదని, పాకిస్థాన్ తో శాంతియుత సంబంధాలనే కోరుకుంటున్నామని మోదీ వివరించారు. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ప్రధాని మోదీ-జిన్ పింగ్ భేటీ వివరాలను వెల్లడించారు.
Narendra Modi
Pakistan
India

More Telugu News