Neeti Ayog: 15న రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం

  • పలు కీలక అంశాలపై చర్చ
  • హాజరుకానున్న అన్ని రాష్ట్రాల సీఎంలు తదితరులు
  • సమావేశానంతరం విందు ఇవ్వనున్న ప్రధాని
ఈ నెల 15న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్‌లో జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ట్రాన్స్ పార్మింగ్ అగ్రికల్చర్, ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం, వర్షపు నీటి సంరక్షణ, భద్రతా పరమైన అంశాలు, కరువు పరిస్థితి, ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం, ఏక్ భారత్ శ్రేష్ట్ అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. వీరందరికీ సమావేశానంతరం ప్రధాని విందు ఇవ్వనున్నారు.
Neeti Ayog
President Bhavan
Narendra Modi
Transforming Agriculture
Aspirational District Programme

More Telugu News