Jagan: ఏ రాష్ట్రం కూడా హామీలను ఇంత త్వరితగతిన అమలు చేయలేదు!: సామినేని ఉదయభాను

  • మద్యపాన నిషేధానికి దశలవారీ చర్యలు
  • జగన్ పట్టుదల ఉన్న వ్యక్తి
  • ఏ పనైనా అనుకుంటే చేసి తీరుతారు
రాష్ట్రంలోని ప్రజలంతా రాజన్న రాజ్యం తిరిగి రావాలని ఎదురు చూస్తున్నారని ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారని, వాటికి సంబంధించిన జీవోలను కూడా జారీ చేశారని పేర్కొన్నారు.

ఇక మద్యపాన నిషేధానికి దశల వారీగా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా హామీలను ఇంత త్వరితగతిన అమలు చేయలేదన్నారు. జగన్ పట్టుదల ఉన్న వ్యక్తి అని, ఏ పనైనా అనుకుంటే చేసి తీరుతారని ఉదయభాను తెలిపారు. రాష్ట్రంలోనే 86 శాతం సీట్లు గెలుచుకున్న ఏకైక పార్టీ వైసీపీ అని పేర్కొన్నారు. జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆయన స్పష్టం చేశారు.
Jagan
Samineni Udaya Bhanu
YSRCP
Rajanna Government
G.O Issued

More Telugu News