Jagan: బీసీలకు సరికొత్త అర్థం చెప్పిన ఏపీ సీఎం

  • బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాస్ కాదు
  • బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్
  • డిప్యూటీ సీఎంల్లో నలుగురు బలహీన వర్గాల వారికి అవకాశం ఇచ్చాం
ఏపీ సీఎం జగన్ పదవీప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించాక ప్రతి విషయంలోనూ తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తుండడం తెలిసిందే. ఐదుగురు డిప్యూటీ సీఎంలు, మంత్రిపదవులపై ఎవరికీ గ్యారంటీ ఇవ్వకపోవడం వంటి అంశాలతో జగన్ ప్రత్యేకత చాటుకున్నారు. మంత్రివర్గంలో కూడా అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించిన ఆయన ముఖ్యంగా బలహీన వర్గాల వారికి పెద్దపీట వేశారు. దీనిపై ఆయన ట్వీట్ చేశారు.

బీసీలు అంటే ఇకమీదట బ్యాక్ వర్డ్ క్లాస్ కాదని, బీసీలు అంటే బ్యాక్ బోన్ క్లాస్ అని సరికొత్త భాష్యం చెప్పారు. అందుకే తమ మంత్రివర్గంలో 60 శాతం మంది బడుగు బలహీన వర్గాలకే ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు. ఐదుగురు ఉపముఖ్యమంత్రుల్లో నలుగురు బడుగు బలహీన వర్గాల వారేనని సీఎం స్పష్టం చేశారు. ఆఖరికి స్పీకర్ విషయంలోనూ తమ నిబద్ధత చాటుకున్నామని, తమ్మినేని సీతారాంను ఎంపిక చేయడం ద్వారా ఆ విషయాన్ని నిరూపించుకున్నామని తన ట్వీట్ లో వివరించారు.
Jagan
Andhra Pradesh

More Telugu News