Telangana: తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటిని ముట్టడించిన టీఆర్టీ అభ్యర్థులు!

  • ఫలితాలు వచ్చి 7 నెలలు అయ్యాయి
  • అయినా ఇంకా పోస్టింగులు ఇవ్వలేదు
  • విద్యావాలంటీర్లను నియమిస్తున్నారని ఆగ్రహం
తెలంగాణలో ఈరోజు టీఆర్టీ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రవేశ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలన్న డిమాండ్ తో తెలంగాణ సీఎం నివాసం ప్రగతి భవన్ ను ముట్టడించారు. వెంటనే అప్రమత్తమయిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు.

ఈ సందర్భంగా ఆందోళనకారులు మాట్లాడుతూ.. ఫలితాలు వచ్చి 7 నెలలు అవుతున్నా, ఇప్పటివరకూ టీఆర్టీ అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు పోస్టింగులు ఇస్తామని చెప్పి రాత్రికిరాత్రే విద్యా వాలంటీర్లను నియమించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆమరణ నిరాహారదీక్షలకు కూర్చుంటామని హెచ్చరించారు.
Telangana
Chief Minister
KCR
trt

More Telugu News