Kangana: నా భర్తతో ఏళ్ల పాటు సహజీవనం చేసి, ఆపై అత్యాచారమంటావా?: కంగనా రనౌత్ పై మండిపడ్డ జరీనా!

  • ఆదిత్య తనను లైంగికంగా వేధించాడన్న కంగనా
  • డేటింగ్ ముగిసిన తరువాత రేప్ అనడం తప్పన్న జరీనా
  • ముందు జాగ్రత్తగా కంగనపై పోలీసులకు ఫిర్యాదు
తన భర్త ఆదిత్య పంచోలీ, కంగనా రనౌత్ మధ్య ఏం జరిగిందో తనకు తెలుసునని బాలీవుడ్‌ నటి జరీనా వాహబ్‌ వ్యాఖ్యానించారు. పదమూడు సంవత్సరాల క్రితం ఆదిత్య, తనను మానసికంగా, లైంగికంగా వేధించాడని కంగన చేసిన కామెంట్స్‌ పై జరీనా తీవ్రంగా మండిపడ్డారు. ఓ పెళ్లయిన వ్యక్తితో ఏళ్ల పాటు డేటింగ్ చేసి, విడిపోయిన తరువాత తనపై అత్యాచారం చేశారని ఆరోపించడం చాలా తప్పని అన్నారు.

కంగన పోలీసులను ఎక్కడ ఆశ్రయిస్తుందోనన్న ఆలోచనతో, ముందుజాగ్రత్త చర్యగా ఆదిత్యనే తొలుత పోలీసులను ఆశ్రయించగా, ఈ కేసు ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన జరీనా, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, మరోవైపు హృతిక్ రోషన్ పైనా కంగన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు.
Kangana
Zareena
Aditya
Rape

More Telugu News