electiong commissionr: ఏపీ ఎన్నికల అధికారి ద్వివేదీ బదిలీ...ఆయన స్థానంలో విజయానంద్‌ నియామకం

  • ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసిన సీఈసీ
  • ప్రస్తుతం జెన్‌కో సీఎండీగా ఉన్న విజయానంద్‌
  • 1992లో ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు సబ్‌ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం
ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఏపీ క్యాడర్‌కు చెందిన విజయానంద్‌ను నియమిస్తూ ఈరోజు  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం  కావేటి విజయానంద్‌ ఏపీ జెన్‌కో సీఎండీగా వ్యవహరిస్తున్నారు. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు సబ్‌ కలెక్టర్‌గా విజయానంద్‌ తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు.
electiong commissionr
gopalakrishna dwivedi
vijayanand
replaced

More Telugu News