Tammineni Seetaram: తమ్మినేనిని స్వయంగా స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లిన జగన్!

  • కొద్దిసేపటి క్రితం స్పీకర్ ఎన్నిక
  • తమ్మినేనిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ
  • టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు అభినందనలు
ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరిగింది. సౌమ్యుడిగా పేరు తెచ్చుకోవడంతో పాటు, ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన తమ్మినేని సీతారాం స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికకాగా, ఆయన్ను వైఎస్ జగన్ తో పాటు పలువురు అధికార, విపక్ష సభ్యులు అభినందించారు. జగన్ స్వయంగా తమ్మినేనిని స్పీకర్ చైర్ వద్దకు తీసుకు వెళ్లారు. ఈ సమయంలో విపక్ష నేత, తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు సభలో కనిపించలేదు. ఆయన గైర్హాజరీలో ఆ పార్టీ మరో నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, తమ్మినేనితో పాటు స్పీకర్ స్థానం వద్దకు నడిచి, ఆయనకు అభినందనలు తెలిపారు. కాగా, తమ్మినేని సీతారాం ఎన్నిక తరువాత చంద్రబాబు అసెంబ్లీకి వచ్చారు.
Tammineni Seetaram
Andhra Pradesh
Assembly
Chandrababu

More Telugu News