Avinash: హద్దు మీరితే సహించేది లేదు: వైసీపీకి దేవినేని అవినాశ్ హెచ్చరిక!

  • ప్రజా తీర్పును శిరసావహిస్తాం
  • అధికారముందని దాడికి వస్తే వూరుకోబోము
  • స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామన్న అవినాశ్
గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తున్నామని, ఇదే సమయంలో అధికారం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, తెలుగుదేశం కార్యకర్తలపై దాడులకు పాల్పడితే సహించేది లేదని తెలుగు యువత ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాశ్ హెచ్చరించారు. విజయవాడలో టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన అవినాశ్, ఆపై మీడియాతో మాట్లాడారు.

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వైసీపీ సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆయన, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో తామేమీ కుంగిపోలేదని, త్వరలో జరిగే పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, మునిసిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటుతామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చుకోవాలని సూచించారు. ప్రస్తుత పార్టీ కార్యాలయం తాత్కాలికమేనని, సమీప భవిష్యత్తులో ఏలూరు రోడ్ లో పూర్తిస్థాయిలో ఆఫీస్ ఏర్పాటు అవుతుందని అన్నారు.
Avinash
Vijayawada
Telugudesam
YSRCP

More Telugu News