Varun Tej: నేను బాగానే ఉన్నాను... రోడ్డు ప్రమాదంపై స్పందించిన వరుణ్ తేజ్

  • వనపర్తి జిల్లాలో ప్రమాదానికి గురైన వరుణ్ తేజ్ కారు
  • మరో కారు ఢీకొట్టిన వైనం
  • క్షేమంగా బయటపడిన హీరో
మెగా హీరో వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైందన్న వార్తలతో మెగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే, ఈ ప్రమాదంలో తనకు ఎలాంటి గాయాలు తగల్లేదని, క్షేమంగానే ఉన్నానని వరుణ్ తేజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

"నేను ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అందరం సేఫ్. ఇలాంటి సమయంలో మీరు నాపై చూపిస్తున్న శ్రద్ధకు, ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ వరుణ్ తేజ్ ట్విట్టర్ లో స్పందించారు.

వరుణ్ తేజ్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడిస్ బెంజ్ కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో వరుణ్ తేజ్ కారు ముందుభాగంలో ఓవైపు పూర్తిగా దెబ్బతిన్నది. కాగా, వరుణ్ తేజ్ కారు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.
Varun Tej
Car
Road Accident

More Telugu News