roja: రోజాకు కీలక పదవిని అప్పగించిన జగన్

  • రోజాకు ఊరట
  • ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా రోజా
  • నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
మంత్రి పదవి దక్కకపోవడంతో కొంత నిరుత్సాహానికి గురైన నగరి ఎమ్మెల్యే రోజాకు ముఖ్యమంత్రి జగన్ తీపి కబురు అందించారు. ఆమెకు కీలకమైన పదవిని అప్పగించారు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా రోజాను నియమించడానికి ఆయన నిర్ణయం తీసుకున్నట్టు తాజా సమాచారం.

తనకు జగన్ ఏ పదవి ఇస్తారో తెలియదని ఇటీవల రోజా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఏ పదవి ఇచ్చినా తగిన న్యాయం చేస్తానని ఆమె తెలిపారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లలో కీలకమైన ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవి ఆమెను వరించింది. దీంతో, ఆమెకు ఊరట లభించినట్టయింది.
roja
ysrcp
apicc
jagan

More Telugu News