నితిన్ 'భీష్మ' సినిమా లాంచ్
- నితిన్ హీరోగా 'భీష్మ'
- కథానాయికగా రష్మిక
- ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్
వెంకీ కుడుముల నుంచి ఇంతకుముందు వచ్చిన 'ఛలో' అనే ప్రేమకథాంశం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ సారి కూడా ఆయన అదే తరహా కథను సెట్ చేసుకున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా ఆయన 'భీష్మ'ను రూపొందిస్తున్నాడు. కొంతకాలంగా సక్సెస్ అనే మాట వినని నితిన్, ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొడతాననే నమ్మకంతో వున్నాడు. ఆయన కోరిక నెరవేరుతుందేమో చూడాలి మరి.