azam khan: గాడ్సే, ప్రజ్ఞా ఠాకూర్ లాంటి వాళ్లను మదర్సాలు పెంచి పోషించవు: ఆజంఖాన్

షార్ట్స్‌లో చూడండి
ఎప్పుడూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నేత ఆజంఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మదర్సాల గురించిన చర్చ జరుగుతున్న తరుణంలో... వివాదానికి మరింత ఆజ్యం పోసేలా వ్యాఖ్యానించారు. గాంధీని చంపిన గాడ్సే లేదా ప్రజ్ఞా ఠాకూర్ లాంటి వారిని మదర్సాలు పెంచి పోషించవని అన్నారు. మదర్సాలను సాధారణ విద్యతో అనుసంధానించాలనే యోచనలో మోదీ ప్రభుత్వం ఉందనే ప్రశ్నకు బదులుగా ఆజంఖాన్ ఈమేరకు సమాధానం ఇచ్చారు.

గాడ్సేను పొగుడుతున్న వారిని ప్రజాస్వామ్యానికి శత్రువులుగా ప్రకటించాలని... టెర్రరిస్టు కార్యకలాపాల కారణంగా జైలు శిక్షను అనుభవించిన వారిని ప్రోత్సహించబోమని తొలుత ప్రకటించాలని ఆజంఖాన్ డిమాండ్ చేశారు. హిందీ, ఇంగ్లీష్, గణితంతో పాటు మతాన్ని కూడా మదర్సాలలో బోధిస్తున్నారని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఏదైనా చేయాలనుకుంటే... మదర్సాలలో వసతులను మెరుగుపరచాలని అన్నారు. పక్కా భవనాలను నిర్మించాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని అన్నారు.
Go Back to Shorts
azam khan
madarasa
sp

More Telugu News