bihar: వృద్ధ తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జైలే.. కొత్త బిల్లుకు బిహార్ కేబినెట్ ఆమోదం!

  • ముసాయిదా బిల్లును ఆమోదించిన మంత్రివర్గం
  • కీలక నిర్ణయం తీసుకున్న సీఎం నితీశ్ కుమార్
  • త్వరలోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
కని పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో చాలామంది పిల్లలు వదిలేస్తున్నారు. వారిని పోషించడం ఇష్టంలేక, ఇతర కారణాలతో దూరం పెడుతున్నారు. ఇలాంటి కుమారులు, కుమార్తెలకు దిమ్మతిరిగే చట్టానికి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ శ్రీకారం చుట్టారు. వృద్ధ తల్లిదండ్రులను వదిలేసే కుమారులు, కుమార్తెలకు జైలుశిక్ష విధించే ముసాయిదా ప్రతిపాదనను బిహార్ కేబినెట్ ఆమోదించింది. త్వరలోనే దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.  
bihar
old parents
jail
bihar caninet
approved

More Telugu News