Chandrababu: అసెంబ్లీకి వెళ్లే ముందు... వెంకటపాలెం బయలుదేరిన చంద్రబాబునాయుడు!

  • ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల
  • ఆపై 10.45 తరువాత అసెంబ్లీకి చంద్రబాబు
  • 11.05కు అసెంబ్లీ ప్రారంభం
నేడు ఉదయం 11.05 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే నిమిత్తం ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 15వ సారి కోలువుదీరిన వేళ, వెలగపూడికి చేరుకునే ముందు వెంకటపాలెంకు చంద్రబాబు వెళుతున్నారు. టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు చంద్రబాబు నివాసానికి చేరుకోగా, వారితో కలిసి చంద్రబాబు అసెంబ్లీకి చేరుకోనున్నారు.

అంతకన్నా ముందు వెలగపూడిలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించాలని ఆయన నిర్ణయించారు. దీంతో మార్గమధ్యంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించి, ఆపై 10.45 గంటల తరువాత ఆయన అసెంబ్లీకి చేరుతారని తెలుస్తోంది. కాగా, ఐదు రోజుల పాటు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు జరుగనుండగా, తొలి రోజున ప్రొటెం స్పీకర్‌ తొలుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో, ఆపై ప్రతిపక్ష నేత చంద్రబాబుతో, తదుపరి మంత్రులు, ఎమ్మెల్యేలతో  ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
Chandrababu
Assembly
NTR
Velagapudi

More Telugu News