Telugudesam: వైసీపీ దాడులను ప్రజల్లో ఎండగట్టాలి: నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు సూచన

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ దాడులను ప్రజల్లో ఎండగట్టాలని టీడీపీ నాయకులకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సూచించారు. ఈరోజు నిర్వహించిన ఏపీ టీడీఎల్పీ సమావేశంలో తమ పార్టీ నాయకులకు చంద్రబాబు పలు సూచనలు చేశారు. వైసీపీ దాడులను నిరసిస్తూ ఎక్కడికక్కడ సంఘీభావ ర్యాలీలు నిర్వహించాలని, తప్పుడు కేసులు బనాయిస్తారని, ఇలాంటి వన్నీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని  సూచించారు.

కొత్తగా ఏర్పడ్డ వైసీపీ ప్రభుత్వానికి తొలుత ఆరు నెలల సమయం ఇద్దామని అనుకున్నామని, కానీ, తమ నాయకులను భయపెట్టడం, దాడులకు పాల్పడటం వంటివి చేస్తుంటే చూస్తూ మౌనంగా ఉండలేమని చెప్పారు. తమ పార్టీపై, నాయకులపై అవినీతి బురద చల్లే ప్రయత్నాలను తిప్పికొట్టాలని సూచించారు. ప్రతి శాఖలో జరిగే కార్యక్రమాలను అధ్యయనం చేయాలని, జీవోలను విశ్లేషించాలని, అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. మనం చేసే విమర్శలు సహేతుకంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని నాయకులతో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం
Go Back to Shorts
Telugudesam
Chandrababu
YSRCP
tdlp

More Telugu News