cm: వైసీపీ నేతలు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదు: వైవీ సుబ్బారెడ్డి

  • త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ 
  • అసెంబ్లీ సమావేశాలు ముగిశాక వీటి భర్తీకి అవకాశం
  • సీఎం జగన్ ని కలిసిన వైవీ సుబ్బారెడ్డి
వైసీపీ నేతలు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదని ఆ పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం నివాసంలో జగన్ ని ఈరోజు ఆయన కలిశారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ, మంత్రి పదవులు దక్కని తమ ఎమ్మెల్యేల్లో ఎటువంటి అసంతృప్తి లేదని చెప్పారు. త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ చేసేందుకు సీఎం చర్యలు చేపట్టనున్నట్టు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఈ పదవులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని, ముఖ్యమైన నామినేటెడ్ పదవులు ఎమ్మెల్యేలకు దక్కవచ్చని అభిప్రాయపడ్డారు.
cm
jagan
YSRCP
yv subba reddy
Tadepalli

More Telugu News