చంద్రబాబు ఆధ్వర్యంలో వేలాది కోట్ల ఖనిజ సంపద దోచుకున్నారు: పెద్దిరెడ్డి
- ఇసుక అక్రమాలు జరిగిన చోట్ల ఓడిపోయారు
- ఉచిత ఇసుక విధానంతో బాగా లాభపడ్డారు
- 25 శాతం ఆదాయం ఖనిజాల నుంచి వచ్చేలా కొత్త పాలసీ
15 రోజుల్లో కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తామని, ప్రభుత్వ ఆదాయంలో 25 శాతం ఆదాయం ఖనిజాల నుంచి వచ్చేలా కొత్త పాలసీ రూపొందిస్తామని మంత్రి చెప్పారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. తక్షణమే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలన్నారు. అక్రమ తరలింపుల విషయంలో జిల్లా అధికారులే బాధ్యత వహించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్య తీసుకుంటామన్నారు.