arun pawar: త్రివిక్రమ్ గారిని చూసి నేర్చుకున్నాను: దర్శకుడు అరుణ్ పవార్

  • త్రివిక్రమ్ తో సాన్నిహిత్యం వుంది 
  • ఆయన ప్రోత్సాహంతో రంగంలోకి దిగాను
  •  'వజ్రకవచధర గోవింద' ఆకట్టుకుంటుంది
అరుణ్ పవార్ దర్శకత్వం వహించిన 'వజ్రకవచధర గోవింద' ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో దర్శకుడు అరుణ్ పవార్ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ "నేను విజువల్ ఎఫెక్ట్స్ చేసేవాడిని .. అలా త్రివిక్రమ్ సినిమాలకి పని చేశాను.

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అతడు' సినిమా నుంచి 'అ ఆ' వరకూ త్రివిక్రమ్ తో నా జర్నీ సాగుతోంది. ఈ కారణంగా ఆయనతో నాకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. నేను ఏ దర్శకుడి దగ్గర పనిచేయలేదు. త్రివిక్రమ్ పని తీరును గమనిస్తూ దర్శకుడిని అయ్యాను. ఆయన ప్రోత్సాహం నాపై నాకు నమ్మకాన్ని పెంచింది. అలా నేను 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' తో రంగంలోకి దిగాను. ఇప్పుడు 'వజ్రకవచధర గోవింద'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చాడు.
arun pawar

More Telugu News