Andhra Pradesh: చంద్రబాబు నివాసంలో ప్రారంభమైన టీడీఎల్పీ భేటీ!

  • హాజరైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు
  • కీలక పథకాల అమలుకు ఒత్తిడిచేసే ఛాన్స్
  • ఉపనేత, విప్ లను నియమించనున్న చంద్రబాబు
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నివాసంలో ఈరోజు టీడీఎల్పీ సమావేశం ప్రారంభమయింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ భేటీకి ఎమ్మెల్యేలు, లోక్ సభ సభ్యులు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

అలాగే టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన రుణమాఫీ సహా ఇతర కీలక పథకాల బకాయిలను ప్రజలకు చెల్లించేలా రేపటి సమావేశంలో ఒత్తిడి తీసుకురావచ్చని పార్టీ వర్గాలు చెప్పాయి. టీడీఎల్పీ నేతగా చంద్రబాబును ఇటీవల పార్టీ నేతలు ఎన్నుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సమావేశంలోనే టీడీపీ ఉపనేత, విప్ లను చంద్రబాబు ఎంపిక చేస్తారని టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.
Andhra Pradesh
Chandrababu
Telugudesam
Telugudesamlp

More Telugu News