sangeeta: తెలుగులో నా తొలి సినిమా హీరో అలీ: హీరోయిన్ సంగీత

  • 14వ యేటనే హీరోయిన్ ను అయ్యాను
  •  తెలుగులో తొలి సినిమా 'ఆశల సందడి'
  • పట్టుదలతో తెలుగు నేర్చుకున్నాను
నటన పరంగా .. గ్లామర్ పరంగా తెలుగు - తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్న నిన్నటితరం కథానాయికగా సంగీత కనిపిస్తుంది. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సంగీత మాట్లాడుతూ, తన కెరియర్ గురించిన విషయాలను ప్రస్తావించారు.

"నేను నా 14వ ఏటనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టాను. తొలిసారిగా తమిళ సినిమాతో నా కెరియర్ మొదలైంది. ఆ తరువాత తెలుగు చిత్రపరిశ్రమ నుంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో నా తొలి హీరో 'అలీ'. ఆయనతో కలిసి నేను 'ఆశల సందడి' అనే సినిమా చేశాను. మొదట్లో నాకు తెలుగు పెద్దగా రాదు. కానీ తెలుగు నేర్చుకోవాలనే పట్టుదలతో నేర్చుకుంటూ వచ్చాను. తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు" అని చెప్పుకొచ్చారు.
sangeeta
ali

More Telugu News