Mamata Banerjee: ఈ హింసకు మీరూ సమాన బాధ్యత వహించాలి: బెంగాల్ సీఎం మమత

  • దేశం మొత్తం మీద నేనొక్కదాన్నే వ్యతిరేకిస్తున్నాను 
  • నా గొంతుకను నొక్కేందుకే ఈ కుట్రలు
  • ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్న కుట్ర అన్న మమత 
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో హింసను ప్రేరేపించడం ద్వారా తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేడర్ ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశం మొత్తం మీద బీజేపీని తానొక్కదాన్నే వ్యతిరేకిస్తుండడంతో తట్టుకోలేని బీజేపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు.

రాష్ట్రంలోని హింస, అల్లర్లకు రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా కేంద్రం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయంలో కేంద్రం తప్పించుకోలేదన్నారు. తన గొంతుకను నొక్కేసేందుకు బీజేపీ ఓ పద్ధతి ప్రకారం హింసకు పాల్పడుతోందని మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా వారి గేమ్ ప్లాన్‌లో భాగమేనన్నారు. అయితే, తన ప్రభుత్వాన్ని కూల్చాలన్న వారి ప్రయత్నాలు ఫలించబోవని మమత తేల్చి చెప్పారు.
Mamata Banerjee
West Bengal
BJP
Narendra Modi

More Telugu News