జమ్ముకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
- సోమవారం రాత్రి ప్రారంభమైన ఎన్కౌంటర్
- ఏజీహెచ్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు హతం
- కొనసాగుతున్న గాలింపు
ఉగ్రవాదులను సయర్ అహ్మద్ భట్, షకీర్ అహ్మద్ వాగేగా గుర్తించారు. వీరిద్దరూ అన్సార్ గజ్వాతుల్ హింద్ (ఏజీహెచ్) ఉగ్రవాద సంస్థకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వీరిపై పలు కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.