militants: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

  • సోమవారం రాత్రి ప్రారంభమైన ఎన్‌కౌంటర్
  • ఏజీహెచ్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు హతం
  • కొనసాగుతున్న గాలింపు
జమ్ముకశ్మీర్‌లోని సోఫియాన్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. అవ్‌నీరా గ్రామంలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు-భద్రతా దళాలకు మధ్య ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.  రాత్రంతా ఇరు వర్గాల మధ్య కాల్పులు కొనసాగగా ఈ ఉదయం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఉగ్రవాదులను సయర్ అహ్మద్ భట్, షకీర్ అహ్మద్ వాగేగా గుర్తించారు. వీరిద్దరూ అన్సార్ గజ్వాతుల్ హింద్ (ఏజీహెచ్) ఉగ్రవాద సంస్థకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వీరిపై పలు కేసులు ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.
militants
gunfight
Jammu And Kashmir

More Telugu News